నువ్వు మొగోడివైతే ఆ పనిచెయ్.. కేటీఆర్ మాస్ ఛాలెంజ్

గతంలో పార్టీ ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటల వీడియోని ప్రెస్ మీట్ లో ప్లే చేయించారు కేటీఆర్.

Advertisement
Update: 2024-07-01 14:22 GMT

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. "నువ్వు మొగోడివైతే.. బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రా.." అంటూ ఛాలెంజ్ చేశారు. జగిత్యాలలో జరిగిన బీఆర్ఎస్ మీటింగ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఎన్నికల బరిలో దిగితే.. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు కేటీఆర్.

గతంలో పార్టీ ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీ మారిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పిన మాటల వీడియోని ప్రెస్ మీట్ లో ప్లే చేయించారు కేటీఆర్. మరిప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. వారితో రాజీనామా చేయించి తిరిగి పోటీలో నిలబెట్టాలని, అప్పుడు ప్రజలు ఫిరాయింపుదార్లను ఓట్లతో కొట్టి రాజకీయ సమాధి చేస్తారని అన్నారు కేటీఆర్.


తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్లు..

కేటీఆర్ వ్యాఖ్యలకు వెంటనే తెలంగాణ కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. గతంలో 61మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ చేర్చుకుందని, వారందరితో అప్పట్లో రాజీనామా ఎందుకు చేయించలేదని ప్రశ్నించింది. రాజీనామా చేయించకుండానే వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారని చెప్పింది. 



Tags:    
Advertisement

Similar News