భారీగా తగ్గిన బిల్డింగ్ పర్మిషన్లు.. R-TAX కారణమన్న కేటీఆర్

బిల్డింగ్ పర్మిషన్లు తగ్గిపోవడంతో GHMC ఆదాయంపై ఎఫెక్ట్ చూపింది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో రూ.1454 కోట్ల ఆదాయం రాగా.. 2023 - 24 సంవత్సరంలో కేవలం రూ.1,107 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.

Advertisement
Update:2024-06-03 12:27 IST

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్‌‌ పర్మిషన్లు గణనీయంగా తగ్గిపోయాయంటూ టైమ్స్‌ ఆఫ్ ఇండియా రాసిన కథనంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. గత కొన్ని నెలలుగా GHMC పరిధిలో ఉద్దేశపూర్వకంగా భవన నిర్మాణాలకు అనుమతి నిలిపివేశారని ఆరోపించారు కేటీఆర్. ఇదంతా దేనికోసం చేస్తున్నారని ప్రశ్నించారు. GHMC,HMDA పరిధిలో భవన నిర్మాణ అనుమతులను నిలిపివేసి బిల్డర్లపై ఒత్తిడి పెంచి R ట్యాక్స్ వసూలు చేస్తున్నారా అని ప్రశ్నించారు కేటీఆర్.

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు గణనీయంగా తగ్గాయని టైమ్స్ ఆఫ్‌ ఇండియా ఓ కథనం రాసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 13 వేల 522 రెసిడెన్షియల్‌ భవనాలతో పాటు మరో 13 వేల 748 భవన నిర్మాణాలకు GHMC అనుమతి ఇచ్చిందని పేర్కొంది. కానీ ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరంలో భవన నిర్మాణ అనుమతులు భారీగా తగ్గిపోయాయని స్పష్టం చేసింది. 2023-24 మధ్య కాలంలో కేవలం 2 వేల 456 భవనాలకు మాత్రమే పర్మిషన్ జారీ అయిందని తెలిపింది.

బిల్డింగ్ పర్మిషన్లు తగ్గిపోవడంతో GHMC ఆదాయంపై ఎఫెక్ట్ చూపింది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో రూ.1454 కోట్ల ఆదాయం రాగా.. 2023 - 24 సంవత్సరంలో కేవలం రూ.1,107 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. దాదాపు 300 కోట్లకుపైగా ఆదాయం తగ్గిపోయింది.

Tags:    
Advertisement

Similar News