న్యాయం అడిగితే నిరుద్యోగుల్ని కొడతారా..? కేటీఆర్ ఆగ్రహం

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందన్నారు కేటీఆర్. ప్రజాపాలనలో పరామర్శలకు, నిరసనలకు కూడా హక్కు లేదా అని ప్రశ్నించారు.

Advertisement
Update:2024-07-02 08:20 IST

నిరుద్యోగులు, యువకుల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగ నోటిఫికేషన్ లను వెంటనే జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని కోరారు. ఉద్యోగాలకోసం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు కేటీఆర్.


నిరుద్యోగుల పోరాటంపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా తప్పుబట్టారు కేటీఆర్. గాంధీ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న మోతీలాల్ ను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డితోపాటు ఇతర నేతల్ని అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. పోలీసుల అదుపులో ఉన్న నేతలను బేషరతుగా విడుదల చేయాలన్నారు. అటు పోలీసులు కూడా అత్యుత్సాహం మానుకోవాలని, ప్రభుత్వం కోరిక మేరకు దమనకాండ చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు కేటీఆర్. గాంధీ ఆస్పత్రి వద్ద నిరుద్యోగ యువకులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందన్నారు కేటీఆర్. ప్రజాపాలనలో పరామర్శలకు, నిరసనలకు కూడా హక్కు లేదా అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతపై లాఠీ చార్జ్, ప్రతిపక్షాల నాయకులను అడ్డుకోవడం వంటివి.. ప్రభుత్వ దమన నీతికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి అప్రజాస్వామ్య చర్యలను మానుకోవాలని ప్రభుత్వానికి సూచించారు కేటీఆర్. నిరుద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News