కులగణనను స్వాగతిస్తున్నాం.. కానీ..!

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు కేటీఆర్.

Advertisement
Update:2024-02-16 19:22 IST

అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు కేటీఆర్. అయితే కులగణనకోసం తీర్మానం చేస్తే సరిపోదని, దానికి చట్టబద్ధత ఉండాలని ఆయన సూచించారు. దానికోసం బిల్లును తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే మరో రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలని పొడిగించాలన్నారు. కుల గణన కోసం బిల్లు తీసుకొస్తే బీఆర్‌ఎస్‌ తరపున సంపూర్ణ మద్దతిస్తామని స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్‌లోని అంశాలు అన్నింటినీ అమలు చేయాలని.. అప్పుడే కులగణన సక్సెస్ అవుతుందని చెప్పారు కేటీఆర్.

అదే మా ఆకాంక్ష..

బలహీనవర్గాలకు లాభం జరగాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు కేటీఆర్. బీసీల కోసం మంత్రిత్వ శాఖను పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అని గుర్తు చేశారు. ఓబీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ పెట్టాలని గతంలోనే డిమాండ్‌ చేశామని, రాష్ట్ర అసెంబ్లీనుంచి రెండుసార్లు తీర్మానాలు చేసి పంపించామని తెలిపారు. ఓబీసీ శాఖ పెడితే బీసీలకు రూ.2 లక్షల కోట్లు అయినా వస్తాయని చెప్పారు కేటీఆర్.

మరోవైపు కులగణన విషయంలో కేటీఆర్, కడియం కన్ఫ్యూజన్లో ఉన్నారని చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. వారు కన్ఫ్యూజ్ అవడంతోపాటు సభను కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పారు. తీర్మానం క్లియర్ గా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడా కన్ఫ్యూజన్ లేదన్నారు. ఇల్లు ఇల్లు సర్వే చేస్తున్నామని చెప్పారు భట్టి. ప్రతిపక్షాలు ప్రజలకు నష్టం చేసేలా ప్రవర్తించొద్దని సూచించారు. 

Tags:    
Advertisement

Similar News