హైదరాబాద్ విజయవాడ హైవేపై, ఎల్బీ నగర్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు చెల్లు....ఈ రోజు ఫ్లై ఓవర్ ప్రారంభించనున్న కేటీఆర్
విజయవాడ హైవే నుంచి హైదరాబాద్‌కు వచ్చే మార్గంలో ఎల్‌బీ నగర్ వద్ద సిగ్నల్ ఫ్రీగా మారబోతుంది. ఇక ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం ఉండదు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Advertisement
స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా అభివృద్ధి చేసిన ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ (కుడివైపు) ఫ్లై ఓవర్‌ను శనివారం మున్సిపల్ పరిపాలన,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఫ్లైఓవర్ విశేషాలను మంత్రి ట్వీట్ చేయడంతోపాటు కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు.
''GHMC ద్వారా SRDP కింద నిర్మించిన LB నగర్ RHS ఫ్లైఓవర్ ప్రారంభమవుతుంది
పొడవు: 760మీ, వెడల్పు: 12మీ (3-లేన్) మరియు ఫ్లైఓవర్ నిర్మాణ ఖర్చు 32 కోట్ల రూపాయలు
విజయవాడ హైవే నుంచి హైదరాబాద్‌కు వచ్చే మార్గంలో ఎల్‌బీ నగర్ వద్ద సిగ్నల్ ఫ్రీగా మారబోతుంది. ఇక ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం ఉండదు '' అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
Advertisement