రేవంత్ రెడ్డికి రివర్స్‌లో ఝలక్ ఇచ్చిన కొండా
అందరూ కలిసి పనిచేయాలి. కానీ అది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాదు.. బీజేపీలో ఉండి చేయాలి. కాబట్టి.. మీరందరూ బీజేపీలోకి వచ్చేయండి కలిసి పనిచేద్దాం’’ అని రివర్స్‌లో రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్‌ని వీడిన నేతలు మళ్లీ పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి తదితరులతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్ పేర్లని కూడా ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌లోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కానీ అతను ప్రస్తావించిన వారిలో కనీసం ఒక నేత కూడా పాజిటివ్‌గా స్పందించలేదు.
రేవంత్ రెడ్డి ఆహ్వానంపై చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణలో కేసీఆర్‌ని ఓడించాలంటే రేవంత్ రెడ్డి చెప్పినట్లు అందరూ కలిసి పనిచేయాలి. కానీ అది కాంగ్రెస్ పార్టీలో ఉండి కాదు.. బీజేపీలో ఉండి చేయాలి. కాబట్టి.. మీరందరూ బీజేపీలోకి వచ్చేయండి కలిసి పనిచేద్దాం’’ అని రివర్స్‌లో రేవంత్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు.
రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్తాడంటే తాను నమ్మనని చెప్పుకొచ్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఇటీవల అతను బీజేపీతో నాయకులతో కలిసి పనిమీద ఢిల్లీ వెళ్లాడని స్పష్టం చేశారు. అంతేతప్ప కాంగ్రెస్ నాయకులతో కలిసి వెళ్లాడనే ప్రచారంలో నిజం లేదని వెల్లడించారు. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కి బలం చేకూర్చే మాట వాస్తవమేనని అంగీకరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. అది తెలంగాణలో కేసీఆర్‌ని ఓడించేంత బలం మాత్రం కాదని తేల్చి చెప్పేశారు.