కత్తిపోటు.. లాజిక్ వెదికిన కోమటిరెడ్డి

కత్తిపోటు ఘటన విషయంలో కాంగ్రెస్ ప్రమేయం లేదు అని చెప్పడానికే ఆయన తెలివిగా స‌మాధానం చెప్పారు. కానీ కాంగ్రెస్ ని తీసిపారేసినట్టు కోమటిరెడ్డి మాట్లాడటం మాత్రం సంచలనంగా మారింది.

Advertisement
Update:2023-11-01 15:14 IST

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం విషయంలో కాంగ్రెస్ పూర్తిగా కార్నర్ అయింది. అయితే ఈ ఘటనపై ఏం చెప్పాలో వారికి తెలియడంలేదు. దాడి ఘటనను ఖండించకపోగా.. దాని తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వెటకారం చేసి మరింతగా బుక్కయ్యారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరో లాజిక్ వెదికారు. అసలు ప్రభాకర్ రెడ్డిపై దాడి చేయాల్సిన అవసరం తమకేమొచ్చిందన్నారు.


దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ స్థానమేంటో పరోక్షంగా గుర్తు చేశారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అదే సమయంలో అక్కడ కాంగ్రెస్ కి అంత సీన్ లేదని కూడా ఒప్పేసుకున్నారు. కత్తిపోటు ఘటన విషయంలో కాంగ్రెస్ ప్రమేయం లేదు అని చెప్పడానికే ఆయన ఇలా తెలివిగా స‌మాధానం చెప్పారనే విషయం అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ని తీసిపారేసినట్టు కోమటిరెడ్డి మాట్లాడటం మాత్రం సంచలనంగా మారింది.

దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. డిపాజిట్లు కూడా రాని ఆ స్థానంలో తాము ప్రత్యర్థిపై ఎందుకు దాడి చేస్తామనేది కోమటిరెడ్డి లాజిక్. దాడి చేస్తే తమకేమొస్తుందని ఆయన అంటున్నారు. అయితే గియితే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరిగితే బీజేపీ లాభపడుతుందనే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు కోమటిరెడ్డి. పోటీ ఉండే వారి మధ్యే పగ ఉంటుందని, తాము పోటీలో కూడా లేము కదా, డిపాజిట్లు కూడా రాని సీటులో తాము గొడవలకు ఎందుకు దిగుతామని ప్రశ్నిస్తున్నారు కోమటిరెడ్డి. ఆయన లాజిక్ ఎలా ఉన్నా.. నిందితుడు రాజు కాంగ్రెస్ కండువాలతో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ఇరుకునపడింది. అసలు దాడి ఎందుకు చేశాడు, ఎవరు చేయించారు అనేది పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది.

 

Tags:    
Advertisement

Similar News