మహిళా అధికారితో రాజగోపాల్ రెడ్డి దురుసు ప్రవర్తన.. వైరల్ వీడియో

ఐదు నిమిషాల్లో అడిగిన సమాచారం ఇవ్వాలని హుకుం జారీ చేసిన రాజగోపాల్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా హామీలు ఎందుకు అమలు చేయలేదని నిలదీస్తున్నారు నెటిజన్లు.

Advertisement
Update:2024-06-15 08:07 IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దురుసు ప్రవర్తన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మహిళా అధికారిపై పేపర్లు విసిరికొట్టిన ఆయనపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. సమీక్షలు, సమావేశాల్లో నాయకులకు అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఐదు నిమిషాల్లో అడిగిన సమాచారం ఇవ్వాలని హుకుం జారీ చేసిన రాజగోపాల్ రెడ్డి.. అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా హామీలు ఎందుకు అమలు చేయలేదని నిలదీస్తున్నారు నెటిజన్లు.

అసలేం జరిగింది..?

నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించేందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి చౌటుప్పల్‌ పట్టణంలో పర్యటించారు. వివిధ శాఖల అధికారులను పిలిపించి డ్రైనేజీ, సీసీరోడ్డు పనులు, బిల్లుల రికార్డుల గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు రూ.12 కోట్ల అగ్రిమెంట్‌ వేల్యూలో ఎంత గ్రాస్‌ బుక్‌ అయిందని అడిగారు. మహిళా అధికారి సమాధానం చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో ఆయన మరిం అసహనం వ్యక్తం చేశారు. తన చేతిలోని పేపర్లను ఆమెపై విసిరికొట్టారు. తాను అడిగిన దానికి సమాధానం చెప్పాలని, నాలెడ్జ్‌ ఉంటేనే పనిచేయాలని, లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోవాలని గదమాయించారు. ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపించారా..?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి వర్గంలో స్థానం ఆశించారు. అయితే ఆయన సోదరుడు వెంకట్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి ప్రభావం చూపించి ఉంటే రాజగోపాల్ రెడ్డికి కూడా కేబినెట్ లో అవకాశం లభించేదనే ప్రచారం ఉంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి తెలంగాణలో ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో ఇలా ప్రవర్తిస్తున్నారని బీఆర్ఎస్ సెటైర్లు పేలుస్తోంది. గజిబిజి గోపాలం ఇలా ఎందుకు రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ నేతలు కౌంటర్లిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News