కొల్లూరులో ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన సీఎం కేసీఆర్

నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌ షిప్‌ ఏర్పాటైంది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

Advertisement
Update:2023-06-22 12:24 IST

సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రెండో దశ కింద చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ డిగ్నిటీ హౌసింగ్ కాలనీని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ప్రజలకోసం ప్రభుత్వం నిర్మించిన కాలనీల్లో ఆసియాలోనే అతిపెద్దదిగా ఈ డిగ్నిటీ హౌసింగ్ కాలనీ గుర్తింపు తెచ్చుకుంది. దీనికి కేసీఆర్ నగర్ గా నామకరణం చేశారు. ఈ కాలనీ ప్రారంభోత్సం సందర్భంగా ఆరుగురు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ స్వయంగా పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి పాల్గొన్నారు.


ఒకేచోట 60వేలమంది నివాసం..

గేటెడ్ కమ్యూనిటీల పేరుతో ఉన్నతాదాయ వర్గాలు అపార్ట్ మెంట్ల సమూహాలలో నివశిస్తుంటాయి. వాటికి తీసిపోని విధంగా కేసీఆర్ నగర్ అవతరించింది. దాదాపు 60 వేల మంది ఒకేచోట నివాసం ఉండేలా 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించారు. నిరుపేదల కోసం సకల సౌకర్యాలతో కొల్లూరులో ఈ ఆదర్శ టౌన్‌ షిప్‌ ఏర్పాటైంది. రూ.1,489.29 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ భారీ ప్రాజెక్టులో కార్పొరేట్‌ అపార్ట్‌మెంట్లకు తీసిపోకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

మొత్తం 145 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గృహ సముదాయంలో 117 బ్లాకులు, 234 ఎలివేటర్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ సైజు 560 చదరపు అడుగులు. అంతర్గత రోడ్లు, స్మార్ట్ వాటర్ డ్రైనేజీ సిస్టమ్, మంచి నీటి సరఫరా, అంతర్గత డ్రెయిన్లు ఏర్పాటు చేశారు. కమర్షియల్ కాంప్లెక్సులు, కమ్యూనిటీ కాంప్లెక్స్, అంగన్‌వాడీ, పాఠశాలలు ఇక్కడే ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ కాలనీ వాసులకోసం బస్ స్టాప్ ఏర్పాటు చేశారు. ఫైర్ స్టేషన్, పెట్రోల్ బంక్, పోలీస్ స్టేషన్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ఇంటికి దాదాపు రూ.7.90 లక్షల వ్యయం కాగా, మరో రూ.75 వేలతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు.

Tags:    
Advertisement

Similar News