మిలియన్ మార్చ్ గురించి పోస్ట్ చేసి నెటిజనులతో తిట్టించుకున్న కిషన్ రెడ్డి
మిలియన్ మార్చ్ సంఘటనను గుర్తు చేసుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నెటిజనుల నుంచి తీవ్ర విమర్శలు చవిచూశారు. మిలయన్ మార్చ్ గురించి చెప్పే తొందరలోనో లేక మిలియన్ మార్చ్ గురించి తెలియకనో గానీ ఆయన షేర్ చేసిన ఇమేజ్ మాత్రం మిలియన్ మార్చ్ ది కాదు.
తెలంగాణ ఉద్యమంలో చరిత్ర సృష్టించినది మిలియన్ మార్చ్.... అనేక పోలీసుల నిర్భందాలను ఎదుర్కొని, ఆటంకాల దాటుకొని వేలాది మంది ప్రజలు టాంక్ బండ్ ఎక్కినరోజు అది. మిలియన్ మార్చ్ లో పాల్గొన్నవారే కాదు తెలంగాణ ప్రజలెవ్వరూ మర్చిపోని గొప్ప మెమొరీ అది.
అయితే ఆ సంఘటనను గుర్తు చేసుకొని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నెటిజనుల నుంచి తీవ్ర విమర్శలు చవిచూశారు. మిలయన్ మార్చ్ గురించి చెప్పే తొందరలోనో లేక మిలియన్ మార్చ్ గురించి తెలియకనో గానీ ఆయన షేర్ చేసిన ఇమేజ్ మాత్రం మిలియన్ మార్చ్ ది కాదు. అది ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన విద్యార్థుల బహిరంగ సభ ఫోటో.
అసలు మిలయన్ మార్చ్ గురించే తెలియని కిషన్ రెడ్డి దాని గురించిమాట్లాడటమేంటని ట్విట్టర్ లో అనేక మంది విరుచుకపడ్డారు. మిలియన్ మార్చ్ లో పాల్గొన్న చాలామంది కామెంట్ చేస్తూ ఆ రోజు కిషన్ రెడ్డి మిలియన్ మార్చ్ లో మాకు ఎక్కడా కనిపించలేదని అన్నారు.
అక్కడితో ఆగలేదు నెటిజనులు అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం టీఆరెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యే ఎండ్ల లక్ష్మీనారాయణ రాజీనామా చేసినప్పుడు కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా తప్పించుకున్న విషయాన్ని గుర్తు చేసిన అనేక మంది నెటిజనులు ఆయనపై విమర్శలు గుప్పించారు.
కిషన్ రెడ్డి గారూ, ఒక్క సారి మీరు మిలియన్ మార్చ్ లో ఉన్న ఒక ఫోటో మా కోసం పోస్ట్ చేయగలరా ? అని మరో నెటిజన్ ప్రశ్నించారు. నిద్రలేపి తన్నించుకోవడ అని దీన్నే అంటారు అని మరో నెటిజన్ విరుచుకపడ్డారు.
కిషన్ రెడ్డి పోస్ట్ పై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.
''తెలంగాణ ఉద్యమం లో రాజీనామా చేయకుండా పారిపోయిన MLA ఎవరో చెప్పుకోండి చూద్దాం?
తల్లిని చంపి బిడ్డను ఇచ్చిండ్రు అని తెలంగాణ పుట్టుకనే పలుమార్లు అవమానించిన మోడీకి, గుజరాతీ బాసుల చెప్పులు మోసే బీజేపీ సన్నాసులకు తెలంగాణ ప్రగతి అర్ధం కాదు
మోడీ వాక్సిన్ కనిపెట్టిండు అని ఫేకుడు మాని పనికి వచ్చే పనులు చెయ్యండి'' అని కేటీఆర్ తన ట్వీట్ లో కామెంట్ చేశారు.
మొత్తానికి ఏదో ఆశించి పోస్ట్ చేస్తే అది తనకే ఎదురు తగలడం పాపం కిషన్ రెడ్డి తలపట్టుకొని ఉటారు.