జనసేన మద్దతు కోరిన తెలంగాణ బీజేపీ
తెలంగాణలో జనసేన పోటీపై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. 32 నియోజకవర్గాలకు ఇటీవలే ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు పవన్‌కల్యాణ్. ఈసారి తప్పనిసరిగా పోటీ చేయాలని జనసేన నేతలు పవన్‌ను కోరుతున్నారు.
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కలిశారు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. అయితే ఈ విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తానని పవన్‌కల్యాణ్ చెప్పినట్లు సమాచారం.
తెలంగాణలో జనసేన పోటీపై ఇప్పటివరకూ క్లారిటీ రాలేదు. 32 నియోజకవర్గాలకు ఇటీవలే ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించారు పవన్‌కల్యాణ్. ఈసారి తప్పనిసరిగా పోటీ చేయాలని జనసేన నేతలు పవన్‌ను కోరుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న జనసేన ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే జనసేన మద్దతు కోరింది బీజేపీ. అయితే ఏపీలో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించిన పవన్‌కల్యాణ్.. తెలంగాణలో బీజేపీతో కలిసి వెళ్తారా లేదా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎన్డీఏలో కొనసాగుతున్నట్లు పవన్ చెప్తున్నప్పటికీ.. కొద్దిరోజులుగా బీజేపీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్.. పవన్ మద్దతు కోరడం హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు తెలంగాణలోనూ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. తెలంగాణలో పోటీపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని తాజాగా పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్.. తెలుగుదేశం, బీజేపీలలో ఎవరికి మద్దతిస్తారో వేచి చూడాల్సిందే.