ఖమ్మం: పేలుడు మృతులకు పది లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం

బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్టు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.

Advertisement
Update:2023-04-12 18:41 IST
ఖమ్మం: పేలుడు మృతులకు పది లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు ప్రకటించిన ప్రభుత్వం
  • whatsapp icon

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా కార్యకార్త‌లు కాల్చిన బాణా సంచా పక్కనే ఉన్న గుడిసె మీద పడి అందులోని గ్యాస్ సిలండర్ పేలిన సంఘటనలో ముగ్గురు మృతిచెందగా, 8 మంది గాయాలపాలైన విషయం తెలిసిందే.

కాగా, బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. గాయాలపాలైన వారికి చికిత్సకయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు.

మరో వైపు చీమ‌లపాడు గ్రామస్తులు నిరసనలకు దిగారు. ఈ సంఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నామా నాగేశ్వర్ రావుపై వారు మండిపడుతున్నారు. బాణాసంచా కాల్చింది నామా వర్గీయులేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాక మరణించినవారి కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News