హైడ్రా కూల్చివేతలపై కీలక వ్యాఖ్యలు
జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటన
Advertisement
హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ప్రకటించారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్నన్నవాటి వైపు వెళ్లమని.. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని హెచ్చరించారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందన్నారు. పేదల జోలికి హైడ్రా రాదన్నారు. వారి ఇళ్లను కూల్చివేస్తున్నామనే తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని రంగనాథ్ కోరారు.
Advertisement