రాజ్యసభకు కేశవరావు రాజీనామా.. ఎందుకంటే!

పదేళ్ల పాటు బీఆర్ఎస్‌లో కొనసాగిన కేశవరావు ఆ పార్టీ తరపున రెండు సార్లు రాజ్యసభ అవకాశాన్ని దక్కించుకున్నారు. 2020లో రెండో సారి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు.. తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉంది.

Advertisement
Update:2024-07-04 15:48 IST

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కె.కేశవరావు బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్‌ దన్‌ఖర్‌కు స్వయంగా స‌మ‌ర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్‌తో పాటు ఢిల్లీకి వెళ్లిన కేశవరావు.. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2013లో కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు కేశవరావు. దాదాపు పదేళ్ల పాటు బీఆర్ఎస్‌లో కొనసాగిన కేశవరావు ఆ పార్టీ తరపున రెండు సార్లు రాజ్యసభ అవకాశాన్ని దక్కించుకున్నారు. 2020లో రెండో సారి రాజ్యసభకు ఎన్నికైన కేశవరావు.. తాజాగా ఆ పదవికి రాజీనామా చేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉంది.




ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఉపఎన్నికలో ఈ పదవి కాంగ్రెస్‌కే దక్కనుంది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ ఈ స్థానం కోసం తిరిగి కేశవరావునే నామినేట్ చేస్తుందని సమాచారం. కె.కె కూతురు విజయలక్ష్మి ప్రస్తుతం హైదరాబాద్ మేయర్‌గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆమె బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు.

Tags:    
Advertisement

Similar News