సుప్రీంకోర్టుకు కేసీఆర్.. ఎందుకంటే?

నరసింహా రెడ్డి తీరును కేసీఆర్ తప్పుపట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. జస్టిస్ నరసింహా రెడ్డి విచారణ వివరాలను మీడియా ముందు వెల్లడించడాన్ని తప్పుపట్టారు కేసీఆర్.

Advertisement
Update: 2024-07-15 00:52 GMT

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యుత్ కొనుగోళ్లపై రేవంత్ సర్కార్ నియమించిన విద్యుత్ కమిషన్‌ను రద్దు చేయాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం సీజేఐ నేతృత్వంలోని న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.

ఇదే అంశంపై ఇటీవల తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే కమిషన్ వేయడం తప్పేమి కాదంటూ కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు కేసీఆర్.

గత బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలో కమిషన్ వేసింది రేవంత్ ప్రభుత్వం. విచారణలో భాగంగా కమిషన్‌ కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే నరసింహా రెడ్డి తీరును కేసీఆర్ తప్పుపట్టారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. జస్టిస్ నరసింహా రెడ్డి విచారణ వివరాలను మీడియా ముందు వెల్లడించడాన్ని తప్పుపట్టారు కేసీఆర్. కమిషన్‌ నుంచి తప్పుకోవాలని జస్టిస్ నరసింహా రెడ్డికి లేఖ సైతం రాశారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో కేసీఆర్ వేసిన పిటీష‌న్‌పై వెలువ‌డే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:    
Advertisement

Similar News