త్వరలోనే వస్తా.. కొట్లాడాల్సింది మనమే - కేసీఆర్

తను త్వరలోనే ప్రజల్లోకి వస్తానన్నారు కేసీఆర్. అధికారంలో లేకపోయినా తెలంగాణ కోసం పని చేసేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు.

Advertisement
Update:2024-01-26 18:21 IST

తెలంగాణ తరపున కొట్లాడాల్సింది బీఆర్ఎస్ ఎంపీలేనన్నారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఎంపీలతో చర్చించారు. తుంటి గాయానికి చికిత్స తర్వాత పార్టీకి సంబంధించిన అంశంపై కేసీఆర్ రివ్యూ చేయడం ఇదే మొదటిసారి.

తను త్వరలోనే ప్రజల్లోకి వస్తానన్నారు కేసీఆర్. అధికారంలో లేకపోయినా తెలంగాణ కోసం పని చేసేది బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. పార్లమెంట్‌లో బీఆర్ఎస్ వాయిస్ బలంగా వినిపించాలని ఎంపీలకు సూచించారు. విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించాలన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టమేనన్నారు కేసీఆర్. ఆపరేషన్ మ్యాన్యువల్‌, ప్రొటోకాల్‌ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.


క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందని.. ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడదామని ఎంపీలతో చెప్పారు కేసీఆర్. లోక్‌సభ, రాజ్యసభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, వైఖరిపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

Tags:    
Advertisement

Similar News