ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేసిన కేసీఆర్.. గజ్వేల్ స్థానం నుంచి గెలుపొందారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ త్వరలోనే ప్రజల ముందుకు రానున్నారు. ఫిబ్రవరి 1న ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్‌లో ఆయన ప్రమాణం చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పార్టీ శ్రేణులు సైతం కేసీఆర్ రాక కోసం ఆతృతతో ఎదురుచూస్తున్నాయి.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలోనూ పోటీ చేసిన కేసీఆర్.. గజ్వేల్ స్థానం నుంచి గెలుపొందారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు వెళ్లిన కేసీఆర్.. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో కాలు జారిపడ్డారు. ఆయన తుంటి భాగానికి గాయమైంది. దీంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయలేకపోయారు.
ఇక పార్లమెంట్ సమావేశాలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. త్వరలోనే ప్రజల్లోకి వస్తానని చెప్పారు కేసీఆర్. తెలంగాణ ప్రజల తరపున కొట్లాడాల్సింది బీఆర్ఎస్సేనని.. పార్లమెంట్‌లో తెలంగాణ గొంతుకను బలంగా వినిపించాలని ఎంపీలకు సూచించారు.