జనవరి 12న రెండు కొత్త సమీకృత కలెక్టరేట్‌ సముదాయాలను ప్రారంబించనున్న కేసీఆర్

జనవరి 12న మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించి కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.అదే రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన ఐడీఓసీని ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

Advertisement
Update:2023-01-09 07:51 IST

మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో కొత్త ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ) లేదా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లను ముఖ్యమంత్రి కేసీఆర్ మరో 10 రోజుల్లో ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు 14 కొత్త ఐడీఓసీలు ప్రారంభించగా, మరో ఎనిమిది ఐడీఓసీలు వివిధ నిర్మాణ దశలో ఉన్నాయి.

జనవరి 12న మహబూబాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించి కొత్త కలెక్టరేట్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.

అదే రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన ఐడీఓసీని ఆయన ప్రారంభించనున్నారు. సాయంత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.

సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18న ఖమ్మం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లతో కలెక్టర్లు, ఇతర అధికారుల కు క్వార్టర్లతో పాటు 25 ఐడీఓసీల నిర్మాణాన్ని చేపట్టింది. రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల అంచనా వ్యయంతో 1.5 లక్షల నుంచి 1.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతున్న ప్రతి సమీకృత జిల్లా సముదాయంలో ప్రజల కోసం వేచి ఉండే గదులు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, పార్కింగ్ స్థలాలు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు ఉంటాయి.

Tags:    
Advertisement

Similar News