కేసీఆర్ సెంచ‌రీ ఖాయమేనా?

ఒకరకంగా బీఆర్ఎస్‌కు గట్టి ప్రత్యామ్నాయం కూడా లేదు. అనుకోని పరిస్ధితిల్లో అనూహ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పుంజుకుంటే తప్ప కేసీఆర్‌ సెంచరీ గ్యారెంటీ అనే అనిపిస్తోంది.

Advertisement
Update:2022-12-30 11:48 IST

కేసీఆర్ సెంచ‌రీ ఖాయమేనా?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సెంచ‌రీ చేయాలని కేసీఆర్‌ గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లే వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్ విస్తరణపై ఒకవైపు బిజీగా ఉంటునే మరో వైపు తెలంగాణాలో 100 సీట్ల సాధన విషయంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 119 నియోజకవర్గాల తెలంగాణలో 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 64 సీట్లొచ్చాయి. తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో 88 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీల నుండి వచ్చిచేరిన ఎమ్మెల్యేలతో బలం 100 దాటింది.

అయితే రాబోయే ఎన్నికల్లో పార్టీకి సొంతంగానే 100 సీట్ల రావాలనే టార్గెట్ పెట్టుకుని కేసీయార్ వ్యూహాలు రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా అన్నీ నియోజకవర్గాలను కేసీఆర్‌ రివ్యూ చేస్తున్నారు. మంత్రుల నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తప్పనిసరిగా మార్చాల్సిన సిట్టింగుల విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు. సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమనే ప్రకటనైతే చేశారు కానీ ఓటమి తప్పదని నిర్ధారణకు వచ్చిన సిట్టింగులను మార్చటం ఖాయం.

సంక్షేమ పథకాలు, అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకోవటం ద్వారా వచ్చే ఎన్నికల్లో సెంచరీ కొట్టాలనే పట్టుదలగా ఉన్నారు. కేసీఆర్‌ ఆలోచన చూస్తుంటే సెంచరీ కొట్టడం పెద్ద కష్టం కూడా కాదనే అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షాల్లో ఏది కూడా బలంగా లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని బీజేపీ నేతలు ఎంత చెబుతున్నా జనాలు నమ్మటం లేదు. ఇక కాంగ్రెస్ పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.

పార్టీ వర్గాల ప్రకారమైతే బీజేపీకి పట్టుమని 30 నియోజకవర్గాల్లో కన్నా గట్టి అభ్యర్ధులు లేరు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోని నేతలను లాక్కోవాలని చూస్తున్నదంటేనే బీజేపీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. ఇక కాంగ్రెస్ పరిస్ధితి చూస్తుంటే నేతల మధ్య కుమ్ములాటలతో పార్టీకి ఓట్లేద్దామని అనుకున్నవాళ్ళు కూడా వెనక్కు వెళిపోయేట్లున్నారు. ఒకరకంగా బీఆర్ఎస్‌కు గట్టి ప్రత్యామ్నాయం కూడా లేదు. అనుకోని పరిస్ధితిల్లో అనూహ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పుంజుకుంటే తప్ప కేసీఆర్‌ సెంచరీ గ్యారెంటీ అనే అనిపిస్తోంది.

Tags:    
Advertisement

Similar News