ఉమ్మడి పౌరస్మృతిపై కేసీఆర్ క్లారిటీ

భారత్.. భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని కేసీఆర్ తెలిపారు. అలా ఆదర్శంగా నిలిచిన భారతీయుల ఐకమత్యాన్ని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-07-11 07:30 IST

దేశ వ్యాప్తంగా ఉమ్మ‌డి పౌర స్మృతి (యూసీసీ)ని అమ‌లులోకి తీసుకురావాల‌ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దీనిపై తెలంగాణ‌ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు సోమ‌వారం స్పందించారు. ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు స్ప‌ష్టం చేశారు.

యూసీసీ వల్ల అన్ని వర్గాల ప్రజల్లో అయోమయం నెలకొంటుందని కేసీఆర్ చెప్పారు. ప్రత్యేక సంస్కృతి కలిగివున్న జాతులు, మతాలకు ఇబ్బందిగా మారుతుందని ఆయ‌న అభిప్రాయం వ్యక్తం చేశారు. బీజేపీ ప్ర‌భుత్వం దేశాభివృద్ధిని విస్మరించి విద్వేష రాజకీయం చేస్తోందని విమర్శించారు. బీజేపీ ఇప్పటికే పలు రకాలుగా ప్రజల మధ్య చిచ్చుపెట్టిందన్నారు. యూసీసీ పేరుతో మరోసారి ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

భారత్.. భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని కేసీఆర్ తెలిపారు. అలా ఆదర్శంగా నిలిచిన భారతీయుల ఐకమత్యాన్ని చీల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆయ‌న ఆవేదన వ్యక్తం చేశారు. యూసీసీపై కేంద్రం నిర్ణయాలను తిరస్కరిస్తున్నట్టు కేసీఆర్ తేల్చి చెప్పారు.

Tags:    
Advertisement

Similar News