మహాయుద్దంలో పాల్గొనేందుకు ఒడిశానుంచి నాయకులు వచ్చారన్న కేసీఆర్
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ , గమాంగ్ చేరిక తనకు వేయి ఏనుగుల బలాన్నిచ్చిందన్నారు. ఈ దేశ గుణాత్మక మార్పు కోసం మనం చేస్తున్న మహా యుద్దంలో పాల్గొనేందుకు ఒడిశానుంచి వచ్చిన నాయకులందరికీ అభినందనలు తెలిపారు కేసీఆర్. గమాంగ్ వంటిమచ్చలేనినాయకులే ఈ దేశానికి కావాలని కేసీఆర్ అన్నారు.
ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కొద్ది సేపటి క్రితం భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఆయనతోపాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, నలుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో గిరిధర్ గమాంగ్ కుమారుడు శిశిర్ గమాంగ్, హేమ గమాంగ్, జయరాం పాంగీ, రామచంద్ర హన్ష్‌డా, బృందావన్ మజ్హీ, నబీన్ నంద, రాథా దాస్, భగీరథి సేతి, మయదార్ జేనా ఉన్నారు. వీరే కాక అనేక మంది జిల్లా పరిషత్ అధ్యక్షులు, మహిళా నేతలు, రైతు సంఘాల నాయకులు, న్యాయవాదులకు కేసీఆర్ కండువాలు కప్పి బీఆరెస్ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ , గమాంగ్ చేరిక తనకు వేయి ఏనుగుల బలాన్నిచ్చిందన్నారు. ఈ దేశ గుణాత్మక మార్పు కోసం మనం చేస్తున్న మహా యుద్దంలో పాల్గొనేందుకు ఒడిశానుంచి వచ్చిన నాయకులందరికీ అభినందనలు తెలిపారు కేసీఆర్. గమాంగ్ వంటిమచ్చలేనినాయకులే ఈ దేశానికి కావాలని కేసీఆర్ అన్నారు.
ఈ దేశంలో రైతు వ్యతిరేక, కార్పోరేట్ అనుకూల పాలన సాగుతోందని, మత విద్వేషాలతో ప్రజలను విభజిస్తున్నారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితినిమార్చాలని కేసీఆర్ అన్నారు. మహానది లాంటి గొప్ప జీవనది ప్రవహిస్తున్న ఒడిశాలో తాగడానికి కూడా నీళ్ళు లేకపోవడం ఎంత అన్యాయం అని కేసీఆర్ మండిపడ్డారు. ఎన్నికల్లో గెలవాల్సిందినాయకులుకాదని ప్రజలు గెలవాలని కేసీఆర్ అన్నారు. అందుకోసమే బీఆరెస్ పుట్టిందన్నారు.