ప్రభాకర్‌ రెడ్డిపై దాడి.. కేసీఆర్ మాస్ వార్నింగ్

ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ధైర్యంగా ఎదుర్కోలేక హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులను అందరూ ముక్త‌కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement
Update:2023-10-30 17:09 IST

మెదక్‌ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన కత్తిదాడిపై స్పందించారు బీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌. బాన్సువాడ బ‌హిరంగ సభలో మాట్లాడుతూ.. కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన దాడి కాదు.. తనపై జరిగిన దాడి అంటూ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. జుక్కల్‌ సభలోనే ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి గురించి తెలిసిందని.. అయితే ప్రభాకర్‌ రెడ్డి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని డాక్టర్లు చెప్పారన్నారు. విషయం తెలిసిన దగ్గర నుంచి తన మనసు బాగా లేదన్నారు కేసీఆర్‌.


ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ధైర్యంగా ఎదుర్కోలేక హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులను అందరూ ముక్త‌కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. కత్తితో పొడవాలంటే చేతులు మాకు లేవా అంటూ అక్కడి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తలచుకుంటే రాష్ట్రమంతా దుమ్ము లేస్తుందన్నారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో ప్రశాంతత నెలకొందని చెప్పారు. చేతకాని దద్దమ్మలే దాడులు చేస్తారని మండిపడ్డారు.

నారాయణ్‌ఖేడ్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ తర్వాత సీఎం కేసీఆర్‌ నేరుగా యశోద హాస్పిటల్‌కు చేరుకోనున్నారు. అక్కడ ఎంపీ ప్రభాకర్ రెడ్డిని పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్నారు.

Tags:    
Advertisement

Similar News