గూగుల్ సెర్చ్‌లో 'కేసీఆర్' టాప్.. తెలంగాణ సీఎంపై నెటిజన్ల ఆసక్తి
Google search trends of CM KCR in 2022: వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్‌లోనే కాకుండా కేసీఆర్ కోసం గూగుల్ సెర్చ్‌లో కూడా తెగ వెతికేస్తున్నారు. ఈ ఏడాది (2022)లో కేసీఆర్ గూగెల్ సెర్చ్ ట్రెండ్స్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న పలు ప్రజాకంటక నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న సీఎంగా ఇప్పటికే జాతీయ మీడియా కూడా ఆయనను హైలైట్ చేస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున దేశ రాజకీయాలను మారుస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. దసరా రోజు టీఆర్ఎస్ పేరును మారుస్తూ నిర్ణయం తీసుకోగా.. తాజాగా ఎన్నికల సంఘం కూడా ఆమోద ముద్ర వేసింది. దీంతో శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్టీ అధ్యక్షుడి హోదాలో ఈసీఐ లేఖపై సంతకం చేశారు. దీంతో మరోసారి కేసీఆర్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు.
కేవలం వార్తా పత్రికలు, టీవీ ఛానల్స్‌లోనే కాకుండా కేసీఆర్ కోసం గూగుల్ సెర్చ్‌లో కూడా తెగ వెతికేస్తున్నారు. ఈ ఏడాది (2022)లో కేసీఆర్ గూగెల్ సెర్చ్ ట్రెండ్స్‌లో టాప్ పొజిషన్‌లో నిలిచారు. బీఆర్ఎస్ ఏర్పాటు, అనేక సంక్షేమ పథకాల కారణంగానే ఆయన కోసం దేశ ప్రజలు గూగుల్‌లో అన్వేషిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎంతలా కేసీఆర్ కోసం వెతుకుతున్నారంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే కేటీఆర్‌ను కూడా దాటేసి 'కేసీఆర్' ముందంజలో ఉన్నారు. గత 12 నెలలుగా కేటీఆర్ కంటే కేసీఆర్ గూగుల్ సెర్చ్‌లో ముందున్నారు.
గూగుల్‌లో ఎక్కువగా.. KCR new party, KCR National Party, KCR New Party name, BRS Party, BRS Full Form, KCR, KCR New Party, KCR Vs Modi వంటి కీవర్డ్స్ ఉపయోగించి ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ కోసం మేఘాలయ, గోవాల్లో కూడా నెటిజన్లు సెర్చ్ చేయడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు నాడు గూగుల్‌లో ఆయన గురించి ఎక్కువగా వెతికారు. అలాగే అక్టోబర్ 5న బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన రోజు కూడా కేసీఆర్ గురించి ఎక్కువ సెర్చ్‌లు జరిగినట్లు తెలుస్తున్నది.
ఈ ఏడాది మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. మార్చిలో ఈ ప్రెస్ జరుగగా.. ఆ రోజంతా దేశం నలుమూలల నుంచి కేసీఆర్ కోసం గూగుల్‌లో వెతికారు. ఆ రోజు కేసీఆర్ వర్సెస్ మోడీ అనేది చాలా ఎక్కువగా ట్రెండ్ అయ్యింది.
ఇక రాష్ట్రంలోని సంక్షేమ పథకాల కోసం కూడా గూగుల్‌లో వెతుకుతున్నారు. కేసీఆర్ ఏయే స్కీమ్స్ అమలు చేస్తున్నారో కూడా నెటిజన్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. అన్నిటి కంటే ఎక్కువగా 'కేసీఆర్ కిట్ల' గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపారు. ఆ పథకానికి గూగుల్‌లో విపరీతమైన సెర్చ్‌లు లభించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కూడా కేసీఆర్‌ను సెర్చ్ చేశారు. ఇందులో ఎక్కువగా మునుగోడు, దుబ్బాక, నకిరేకల్, పోచంపాడు, నాగర్‌కర్నూల్, సుల్తానాబాద్, పంచలింగాల ప్రాంతాలకు చెందిన వాళ్లు ఉన్నారు.