మోడీ, రేవంత్‌ను ఢీకొట్టేందుకు.. కేసీఆర్‌ చేతిలో 2 అస్త్రాలు

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు కేసీఆర్. జ‌నం నుంచి మంచి స్పంద‌న వ‌స్తుండటంతో బ‌స్సు యాత్రం చేద్దామని తెలిపారు.

Advertisement
Update:2024-04-19 07:43 IST

లోక్‌స‌భ ఎన్నికల్లో ప్రచారం, అనుసరించే వ్యూహంపై గులాబీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. తెలంగాణ భ‌వ‌న్‌లో కేసీఆర్ అధ్యక్షత‌న పార్టీ విస్తృత స్థాయి స‌మావేశం దాదాపు రెండున్నర గంట‌ల‌కు పైగా సాగింది. 17 ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల అభ్యర్థుల‌కు బీ ఫారాలు అంద‌జేశారు కేసీఆర్‌. ఎన్నిక‌ల ఖ‌ర్చు కోసం ఒక్కో అభ్యర్థికి పార్టీ తరఫున రూ. 95 ల‌క్షల విలువ చేసే చెక్కులు కూడా ఇచ్చారు.

ఉదయం పొలంబాట, సాయంత్రం రోడ్ షోలు..

పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు కేసీఆర్. జ‌నం నుంచి మంచి స్పంద‌న వ‌స్తుండటంతో బ‌స్సు యాత్రం చేద్దామని తెలిపారు. ఈనెల 22 నుంచి రోడ్డు షోలు నిర్వహిస్తామ‌న్నారు. ఒక్కో లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రెండు, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రోడ్‌షోలు ఉంటాయ‌న్నారు. రోజుకు రెండు, మూడు రోడ్‌షోలు ఉంటాయ‌న్నారు. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు రైతుల వ‌ద్దకు వెళ్లాలి. "సాయంత్రం రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలి. వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ సెంట‌ర్లలో భారీ బ‌హిరంగ స‌భ‌లు పెట్టాలి" అని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు.

Tags:    
Advertisement

Similar News