ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్
ఉద్యోగులకు, పింఛనర్లకు డీఏ పెంపు విషయాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Advertisement
ఉద్యోగులు, పింఛన్‌దారులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఒక డీఏను ప్రకటించింది. 2.73 శాతం డీఏను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2021 జూలై నుంచి 2022 డిసెంబర్ వరకు డీఏ బకాయిలను 8 విడతల్లో జీపీఎఫ్‌లో జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి నుంచి పెరిగిన డీఏను నెలనెల చెల్లిస్తారు.
ఉద్యోగులకు, పింఛనర్లకు డీఏ పెంపు విషయాన్ని ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఉద్యోగులు, పింఛనర్ల డీఏను 17.29 శాతం నుంచి 20.02 శాతానికి పెంచినట్టు చెప్పారు. డీఏ పెంపుతో 4.4 లక్షల మంది ఉద్యోగులకు, 2.88 లక్షల మంది పింఛనర్లకు లబ్ది చేకూరుతుంది.
Advertisement