బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీకి కేసీఆర్‌ ఆత్మీయ వీడ్కోలు

శ్రీనివాస్‌ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించిన మాజీ సీఎం

Advertisement
Update:2024-11-28 18:46 IST

బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ, తెలంగాణ భవన్‌ ఇన్‌చార్జీ, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డికి పార్టీ చీఫ్‌, మాజీ సీఎం కేసీఆర్‌ ఆత్మీయ వీడ్కోలు పలికారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ జనరల్‌ సెక్రటరీగా, పార్టీ హెడ్‌ ఆఫీస్‌ తెలంగాణ భవన్‌ ఇన్‌చార్జీగా శ్రీనివాస్‌ రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్‌ చేదోడు వాదోడుగా నిలిచిన శ్రీనివాస్‌ రెడ్డికి 85 ఏళ్లు నిండాయి. వయోభారం కారణంగా శ్రీనివాస్‌ రెడ్డి దంపతులను తమ దగ్గరికి వచ్చేయాలని అమెరికాలో ఉన్న వారి వారసులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఎర్రవెల్లి ఫాం హౌస్‌ కు వెళ్లిన శ్రీనివాస్‌ రెడ్డి దంపతులు, కుటుంబ సభ్యులకు కేసీఆర్‌ దంపతులు ఘన స్వాగతం పలికారు. ఘనంగా సన్మానించి ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని పంచుకున్నారు. ఆయనపై ప్రేమతో 'విత్‌ లవ్‌ కేసీఆర్‌' అనే లాకెట్‌ ఉన్న గోల్డ్‌ చైన్‌ ను కేసీఆర్‌ స్వయంగా శ్రీనివాస్‌ రెడ్డి మెడలో వేశారు. కేసీఆర్‌ను, తెలంగాణాను వదిలి వెళ్లడం కష్టంగానే ఉందని, తప్పనిసరి పరిస్థితుల్లోనే అమెరికా వెళ్లాల్సి వస్తుందని ఈ సందర్భంగా శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. శ్రీనివాస్‌ రెడ్డి దంపతులు, కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ దంపతులు లంచ్‌ చేశారు. వాళ్లు తిరిగి ప్రయాణమవుతున్నప్పుడు కేసీఆర్‌ బయటికి వచ్చి స్వయంగా కారు ఎక్కించి వీడ్కోలు పలికారు.

Tags:    
Advertisement

Similar News