ఈడీ రిపోర్ట్ లో కేసీఆర్ పేరు లేదు..

కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వు చేశారు.

Advertisement
Update: 2024-05-28 17:13 GMT

ఢిల్లీ హైకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈడీ వాదనల్లో కేసీఆర్ ప్రస్తావన ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే వార్తల్ని గుడ్డిగా ప్రసారం చేసింది. తీరా సాయంత్రానికి నాలుక మడతేసింది, తప్పుడు వార్తలన్నిటినీ డిలీట్ చేసింది. అసలు ఈడీ రిపోర్ట్ లో ఎక్కడా కేసీఆర్ ప్రస్తావన లేదని కవిత తరపు న్యాయనాది మోహిత్ రావు క్లారిటీ ఇచ్చారు.


అసలేం జరిగింది..?

కవిత బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో ఈడీ తన రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఈడీ వాదనల్లో కేవలం మాగుంట రాఘవరెడ్డి వాంగ్మూలాన్ని మాత్రమే ప్రస్తావించింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు కూడా ఈడీ వాదనలో ఉంది. మాగుంట శ్రీనివాసులురెడ్డి ద్వారా ఆయన తనయుడు రాఘవరెడ్డికి లిక్కర్ కేసులో ఉన్న వ్యక్తులు పరిచయం అయ్యారని ఈడీ తెలిపింది. అయితే మీడియాలో కవిత, కేసీఆర్ పేర్లు బయటకు వచ్చాయి. కేసీఆర్ కు ఈ కేసు గురించి ముందే తెలుసని, కవిత ఆయనకు అన్ని విషయాలు చెప్పారని మీడియా కథనాలు అల్లింది. చివరకు కవిత తరపు లాయర్ పూర్తి వివరణ ఇవ్వడంతో అదంతా తప్పుడు ప్రచారం అని తేలింది.

ఇక కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. హైకోర్టు జడ్జి తీర్పును రిజర్వు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్ పేరు తెరపైకి రావడం విశేషం. కొంతమంది కావాలనే కేసీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిందని ప్రచారం మొదలు పెట్టారని, బీఆర్ఎస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేతలంటున్నారు. కవిత తరపున న్యాయవాది వివరణతో.. ఈడీ రిపోర్ట్ లో కేసీఆర్ ప్రస్తావన లేదని తేలిపోయింది. 

Tags:    
Advertisement

Similar News