ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టుకు కవిత
తనతో ఇతరులను కలిపి విచారిస్తామని నోటీసులో తెలిపిన ఈడీ అలా చేయలేదని కవిత కోర్టుకు తెలిపారు. తనకు సమాచారం ఇవ్వకుండానే తన ఫోన్ ను సీజ్ చేశారని ఆమె ఆరోపించారు.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనకు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం మహిళను తన ఇంటికి వెళ్ళి విచారించాల్సి ఉండగా ఈడీ తనను కార్యాలయానికి రప్పించిందని కవిత తని పిటిషన్ లో పేర్కొన్నారు.
తనతో ఇతరులను కలిపి విచారిస్తామని నోటీసులో తెలిపిన ఈడీ అలా చేయలేదని ఆమె కోర్టుకు తెలిపారు. తనకు సమాచారం ఇవ్వకుండానే తన ఫోన్ ను సీజ్ చేశారని కవిత ఆరోపించారు.
తనను మళ్ళీ విచారణకు హాజరుకావాలన్న ఈడీ నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె సుప్రీం కోర్టును కోరారు. కవిత పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఈడి విచారణకు హాజరుపై స్టే విధించాలన్న కవిత అభ్యర్థనపై కోర్టు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఈ పిటిషన్ పై ఈ నెల 24న వాదనలు వింటామని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.