కవితను అరెస్టు చేయవచ్చు.... కేసీఆర్ వ్యాఖ్యలు

కవిత అరెస్టయితే ముందస్తు ఎన్నికలు అవుతాయని కొద్ది రోజులుగా అవుతున్న ప్రచారానికి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిగే ప్రసక్తే లేదని షెడ్యూల్ ప్ర‌కార‌మే జరుగుతాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Advertisement
Update:2023-03-10 18:52 IST

రేపు ఈడీ విచారణకు హాజరయ్యే కల్వకుంట్ల కవితను అరెస్టు చేయవచ్చని బీఆరెస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖానించారు. నిజాయితీగా పనిచేసినా బద్నాం చేస్తున్నారని, బీజేపీ పాల్పడుతున్న ఈ అప్రజాస్వామిక చర్యలను ఎదుర్కోవాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి స‌మావేశంలో ఆయన మాట్లాడుతూ కవితను అరెస్ట్ చేసినా మనం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, బీజేపీ పై పోరాటం కొనసాగిద్దామని అన్నారు.

కవిత అరెస్టయితే ముందస్తు ఎన్నికలు అవుతాయని కొద్ది రోజులుగా అవుతున్న ప్రచారానికి కేసీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిగే ప్రసక్తే లేదని షెడ్యూల్ ప్ర‌కార‌మే జరుగుతాయని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

''తెలంగాణలో ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్‌లోనే జరుగుతాయి. మీరందరూ దాని ప్రకరామే ప్లాన్ చేసుకోండి. సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టండి. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ 27న ఎల్బీ స్టేడియంలో బీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశం జరుగుతుంది'' అని కేసీఆర్ బీఆరెస్ నాయకులకు చెప్పారు. ఇకపై నాయకులంతా ప్రజల్లోనే ఉండాలని, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు తిరిగే విధంగా ప్లాన్ చేసుకోవాలని ఆయన సూచించారు. 

Tags:    
Advertisement

Similar News