రైతులపై కర్ణాటక మంత్రి కామెంట్స్..కేటీఆర్ రియాక్షన్

శివానంద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. వీళ్లు ఎలా మంత్రులయ్యారంటూ ట్వీట్ చేశారు.

Advertisement
Update:2023-12-25 16:29 IST
రైతులపై కర్ణాటక మంత్రి కామెంట్స్..కేటీఆర్ రియాక్షన్
  • whatsapp icon

కర్ణాటక కో-ఆపరేటీవ్ మినిస్టర్ శివానంద పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బెళగావి జిల్లా చిక్కొడిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన శివానంద పాటిల్‌.. రైతులు ఏటా కరువు రావాలని కోరుకుంటున్నారని, కరువు వస్తే ప్రతిసారి రుణమాఫీ పొందొచ్చన్న ఆలోచనలో రైతులు ఉన్నారంటూ వివాదాస్ప‌ద కామెంట్స్ చేశారు.

శివానంద వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. పాటిల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. పాటిల్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని.. రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కర్ణాటక బీజేపీ స్టేట్ చీఫ్‌ విజయేంద్ర యడ్యూరప్ప. రైతుల జీవితాలతో చెలగాటమాడటం, రైతులపై దౌర్జన్యం చేయడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. రైతులను అవమానించే బాధ్యతను శివానందకు అప్పగించినట్లుందని సెటైర్ వేశారు.


శివానంద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. వీళ్లు ఎలా మంత్రులయ్యారంటూ ట్వీట్ చేశారు. రైతుల గురించి హస్యాస్పద కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఏ రైతు కూడా కరువు కోరుకోడని, అత్యంత దారుణమైన పరిస్థితుల్లో కూడా రైతులు కోరుకునేది ప్రభుత్వం నుంచి సానుభూతి మాత్రమేనని ట్వీట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News