అన్ని రాష్ట్రాల రైతులదీ ఒకటే నినాదం.. 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్'..

తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలపై కర్నాటక, కేరళ, తమిళనాడు రైతు సంఘాల నేతలు ప్రశంసల జల్లు కురిపించారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement
Update:2023-01-25 06:52 IST

'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్'.. బీఆర్ఎస్ నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల రైతన్నలు తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు కావాలంటున్నారు. ఈసారి కేంద్రంలో బీఆర్ఎస్ నేతృత్వంలోని ప్రభుత్వం రావాల్సిందేనంటున్నారు. తెలంగాణలో పర్యటించిన కేరళ, కర్నాటక, తమిళనాడు రైతు సంఘాల నేతలు ఈసారి కేంద్రంలో కిసాన్ సర్కార్ రావాలని, దానికి కేసీఆర్ నేతృత్వం వహించాల్సిందేనన్నారు.

పథకాలు అద్భుతం..

తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలపై కర్నాటక, కేరళ, తమిళనాడు రైతు సంఘాల నేతలు ప్రశంసల జల్లు కురిపించారు. ఇక్కడ అమలవుతున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మూడు రాష్ర్టాల రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌ నాయకత్వంలో పని చేసేందుకు వారంతా సంసిద్ధత వ్యక్తంచేశారు. తమ రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కవిత దృష్టికి తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా రైతు సమస్యలు పరిష్కారమవ్వాలంటే కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడాలన్నారు.

రైతు బీమా, రైతుబంధు వంటి పథకాలు అమలుచేస్తున్న సీఎం కేసీఆర్‌ ను రైతు పక్షపాతిగా అభివర్ణించారు కర్నాటక, కేరళ, తమిళనాడు రైతు సంఘాల నేతలు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలులో లేవన్నారు. తెలంగాణ రైతులకు వేల కోట్ల ఖర్చుతో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అమలు చేయడం గొప్ప విషయమన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ఇతర రాష్ట్రాల రైతులు కూడా కేసీఆర్‌ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు, చేపడుతున్న పనులు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. కేసీఆర్‌ నాయకత్వంలో ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ ఖాయమని చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News