కాంగ్రెస్‌లో కమ్మవారి చిచ్చు.. మెజార్టీ సీట్ల కోసం పేచీ!

కమ్మ సామాజికవర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వాలని కమ్మవారి ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పలువురు ఆశావహులు ఢిల్లీలోనే మకాం వేశారు.

Advertisement
Update:2023-10-06 20:41 IST

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ఇప్పటికే బీఆర్ఎస్‌ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్థుల కోసం కసరత్తు ముమ్మరం చేశాయి. ఆశావహులు టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త డిమాండ్‌ తెరపైకి వచ్చింది. కమ్మ సామాజికవర్గానికి ఎక్కువ టికెట్లు ఇవ్వాలని కమ్మవారి ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పలువురు ఆశావహులు ఢిల్లీలోనే మకాం వేశారు.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో తిష్ట వేసిన కమ్మ ఐక్య వేదిక నాయకులు, పలువురు ఆశావహులు రేణుకా చౌదరి నేతృత్వంలో ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. కమ్మ సామాజికవర్గానికి వీలైనన్ని ఎక్కువ సీట్లు ఇవ్వాలని, సముచిత ప్రాధాన్యం కల్పించాలని కోరారు.

బాన్సువాడ, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, మేడ్చల్‌, పాలేరు, ఖమ్మం సీట్లు కమ్మ వారికి కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కాకుండా పార్టీ కోసం మొదటి నుంచి కష్ట పడినవారికే టికెట్లు ఇవ్వాలని కోరుతున్నారు.

Tags:    
Advertisement

Similar News