తుపాకీతో బెదిరించి కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అత్యాచారం

మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఏఎస్పీ, డీఎస్పీ కాళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. ఎస్‌ఐని అదుపులోకి తీసుకుని, సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Update:2024-06-19 11:14 IST

భూపాలపల్లి జిల్లా కాటారం సబ్‌ డివిజన్ పరిధిలోని కాళేశ్వరంలో దారుణం వెలుగు చూసింది. మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. కాళేశ్వరం ఎస్‌ఐ భవానీ సేన్‌కు అమ్మాయిలు, డబ్బు పిచ్చి. గతంలోనూ ఇలాంటి పాడు పనులు చేసి దొరికిన సందర్భాలు అనేకం. ఈ క్రమంలో తన స్టేషన్‌లో పనిచేసే మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ భవానీసేన్ కన్నుపడింది. పథకం ప్రకారం ఓరోజు మహిళా కానిస్టేబుల్‌కు ఫోన్ చేసి కాలు విరిగింది లేవలేకపోతున్నా, సాయం చేయాలని వేడుకున్నాడు. మానవత్వంతో ఇంటికి వెళ్లిన మహిళా కానిస్టేబుల్‌ను తుపాకీతో బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు భవానీసేన్. ఎవరికైనా చెబితే అదే చివరి రోజంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇది జరిగి 20రోజులవుతోంది. రెండురోజుల కిందట మహిళా కానిస్టేబుల్ ఇంట్లోకి దూరి మరోసారి అత్యాచారాం చేశాడు. దీంతో బాధిత కానిస్టేబుల్ ఉన్నతాధికారుల్ని ఆశ్రయించింది.

నేను మంత్రి మనిషిని..

మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఏఎస్పీ, డీఎస్పీ కాళేశ్వరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి విచారణ చేపట్టారు. ఎస్‌ఐని అదుపులోకి తీసుకుని, సర్వీస్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐపై అట్రాసిటీ, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ భవానీసేన్, మహిళా కానిస్టేబుల్‌ను భూపాలపల్లి ఎస్పీ ఆఫీసుకు తరలించారు. ఎస్‌ఐ భవానీసేన్ నోట తరచూ వినిపించే పదం నేను మంత్రి మనిషిని.. నాకేం కాదు. ఇది చెప్పుకుంటూ పై అధికారులను మొదలుకొని కిందిస్థాయి సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతని వేధింపులు భరించలేక ఆ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్, మరో కానిస్టేబుల్‌ బదిలీ చేయించుకొని వెళ్లినట్లు సమాచారం. ఎస్‌ఐ రాసలీలల గురించి ఉన్నతాధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంతో.. పనిచేసిన ప్రతీచోట తన కామవాంఛలు తీర్చుకుంటూ పోతున్నాడు. భవానీసేన్‌పై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News