సీఎం రేవంత్ అల్లుడుపై కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సొంత అల్లుడుపై ప్రశాంతి అధ్యక్షుడు కే.ఏ.పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Advertisement
Update:2024-11-20 16:28 IST

ప్రశాంతి అధ్యక్షుడు కే.ఏ.పాల్ సీఎం రేవంత్ రెడ్డి సొంత అల్లుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అల్లుడు సత్యనారాయణ మాక్సిబిన్ ఫార్మాసిటికల్ కంపెనీ లో డైరెక్టర్. ఎక్కడినుంచి వస్తున్నాయి డబ్బులు..? వేలకు వేల కోట్లు ఫార్మాసిటికల్ కంపెనీలకు.. అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతులను బలవంతంగా భూములు సేకరించడంపై ఫిర్యాదులు వచ్చాయిని పాల్ అన్నారు. వదిలేది లేదు.. త్వరలో వస్తున్నాను. మీరు తొందరపడకండి.. వీళ్ల అవినీతిని ఎక్స్ పోజ్ చేద్దాం. ప్రార్థిద్దాం.. న్యాయం చేయడానికి నేనున్నానని గమనించండి అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోనుకే.ఏ పాల్. షేర్ చేశాడు. సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా 2015లో సత్యనారాయణ రెడ్డి పెళ్లి చేసుకుంది. సత్యనారాయణ .

రెడ్డి మోటార్స్ యజమాని జి.వెంకట్ రెడ్డి కుమారుడు. ఇక లగచర్ల ఘటనపై జాతీయ మానవ హక్కులకి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఫిర్యాదు చేశారు. కస్టడీలో రైతులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ ఫిర్యాదులో వెల్లడించారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ ప్రజలకు రక్షణ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బృందాలు లగచర్లలో పర్యటించి…రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు ఈటల. ఇటు రెండో రోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు లగచర్ల బాధితులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసేవరకు ఢిల్లీని వీడేది లేదంటున్నారు. ఇప్పటికే లగచర్ల బాధితులు ఎస్సీ,ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించి లిఖితపూర్వక ఫిర్యాదులిచ్చారు. 

Tags:    
Advertisement

Similar News