తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా శ్రీనివాస్ రెడ్డి
మీడియా అకాడమీ ఛైర్మన్‌కు కేబినెట్ ర్యాంకు హోదా ఉంటుంది. ప్రస్తుతం నియమితులైన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గతంలో విశాలాంధ్ర పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.
రేవంత్ రెడ్డి సర్కార్ వరుసగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తోంది. తాజాగా తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కె.శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. జీవో విడుదల అయిన నాటి నుంచి రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు స్పెషల్ సెక్రటరీ ఎం.హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మీడియా అకాడమీ ఛైర్మన్ ఎవరవుతారనే సస్పెన్స్‌కు తెరపడినట్లయింది.
మీడియా అకాడమీ ఛైర్మన్‌కు కేబినెట్ ర్యాంకు హోదా ఉంటుంది. ప్రస్తుతం నియమితులైన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గతంలో విశాలాంధ్ర పత్రికకు సంపాదకులుగా పనిచేశారు. ప్రస్తుతం ప్రజాపక్షం పత్రిక ఎడిటర్‌గా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి చంద్రబాబు సీఎంగా ఉన్న టైమ్‌లోనూ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.
కేసీఆర్ సర్కార్ హయాంలో ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణ వ్యవహరించారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు.