తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సుజయ్‌పాల్

తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజయ్‌పాల్‌ నియమితులయ్యారు.

Advertisement
Update:2025-01-14 19:38 IST

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్‌పాల్ నియమితులయ్యారు. ఇప్పటి వరుకు సీజేగా ఉన్నజస్టిస్‌ ఆలోక్‌ అరాధే బాంబే హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు. ఇటీవల ప్రధాన న్యాయమూర్తుల బదీలిలకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. 1964 జూన్‌ 21న జన్మించిన ఆయన బీకాం, ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి 1990లో మధ్యప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నారు.

పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్‌, బోర్డులకు సేవలు అందించిన ఆయన 2011 మే 27న మధ్యప్రదేశ్‌ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా... 2014 ఏప్రిల్‌ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో మార్చి 21న జస్టిస్‌ సుజయ్‌పాల్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయి వచ్చారు

Tags:    
Advertisement

Similar News