కవితకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు

కవిత రిమాండ్ ని మరో రెండువారాలు పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆమె ఈనెల 23 వరకు తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement
Update:2024-04-09 12:23 IST

ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ ని కోర్టు పొడిగించింది. వాస్తవానికి ఈరోజుతో ఆమె రిమాండ్ గడువు ముగుస్తుండటంతో.. ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. కవిత రిమాండ్ ని పొడిగించాలని వారు కోరారు. రిమాండ్ పొడిగించాల్సిన అవసరం లేదంటూ కవిత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి.. కవిత రిమాండ్ ని మరో రెండువారాలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె ఈనెల 23 వరకు తీహార్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గత నెల కవిత అరెస్ట్ అనంతరం కోర్టు అనుమతితో ఈడీ అధికారులు ఆమెను కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపారు. అనంతరం ఆమెకు కోర్టు రిమాండ్ విధించింది. రిమాండ్ లో ఉండగా ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిగాయి. బెయిలివ్వడానికి కోర్టు అంగీకరించలేదు. అదే సమయంలో రిమాండ్ లో ఉన్న కవితను విచారించేందుకు సీబీఐ అధికారులు కూడా కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పుడు రిమాండ్ ని మరో రెండువారాలు పొడిగిస్తూ కోర్టు తాజాగా ఉత్తర్వులిచ్చింది.

కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేయగా.. ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై మాత్రం విచారణ కొనసాగుతోంది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈనెల 20న మరోసారి కోర్టులో ఇరు పక్షాలు వాదనలు వినిపిస్తాయి. అప్పుడు కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈనెల 20న కవితకు బెయిల్ రాకపోయినా ఆ తర్వాత మూడు రోజులకు ఆమె రిమాండ్ గడువు ముగుస్తుంది. 

Tags:    
Advertisement

Similar News