బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు రిజర్వు

బీఆర్‌ఎస్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తియ్యాయి.ఈ తీర్పును జడ్జి రిజర్వ్ చేశారు.

Advertisement
Update:2024-11-12 16:53 IST

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తియ్యాయి. ఈ తీర్పును జడ్జి రిజర్వ్ చేశారు. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ సెక్రటరీ పిటిషన్ చేయగా ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి హైకోర్టులోపిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ అనర్హతపై నెల రోజుల్లో చర్యలు తీసుకోవాలని, ఏం చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలని స్పీకర్‌ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలపై అసెంబ్లీ సెక్రటరీ డివిజన్‌ బెంచ్‌ ముందు అప్పీల్‌ చేశారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన పిటిషన్లలో సింగిల్‌ జడ్జి సరైన ఉత్తర్వులే జారీ చేశారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి తరపు సీనియర్‌ న్యాయవాది జే ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.

సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడంపై దాఖలైన కేసుల్లో సింగిల్‌ జడ్జి గత సెప్టెంబరు 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహాచార్యులు రెండు అప్పీళ్లను దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణను కొనసాగించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ ఆఫీసుకు, ఇంటికి పిటిషన్లను రిజిస్టర్‌ పోస్టులో పంపితే తీసుకోలేదని తెలిపారు. అందుకే హైకోర్టుకు రావాల్సి వచ్చిందన్నారు. కోర్టులో సవాలు చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ, తాము ఇచ్చిన అనర్హత పిటిషన్లపై ఏం నిర్ణయం తీసుకున్నారె ఎలాంటి స్పష్టతనివ్వడం లేదని చెప్పారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం స్పీకర్‌ విధులు నిర్వహించాల్సిందేనని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై తేల్చాల్సింది స్పీకరేనని, ఈ విషయంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు చట్టపరిధిలోనే ఉన్నట్లు స్పష్టం అవుతుందని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News