అభ్యర్థుల్ని ప్రకటించాక కూడా బీఆర్ఎస్ లో చేరుతున్నారే..!

సహజంగా ఎన్నికల వేళ పార్టీ టికెట్లు ఆశించేవారే అటు ఇటు మారుతుంటారు. కానీ బీఆర్ఎస్ లో టికెట్ల పంచాయితీ దాదాపుగా పూర్తయ్యాక కాంగ్రెస్ నుంచి కీలక నేతలు ఇటువైపు రావడం విశేషం.

Advertisement
Update:2023-08-28 22:19 IST

ఎన్నికల ఏడాది తెలంగాణలో నాయకుల వలసలు ఊహించినవే. అయితే బీఆర్ఎస్ ఆల్రడీ అభ్యర్థుల్ని ప్రకటించింది. అంటే అసంతృప్తులు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పక్క పార్టీల్లోకి వెళ్లాలి. కానీ అనూహ్యంగా బీఆర్ఎస్ లోకి నాయకులు వలస వస్తున్నారు, ఇదే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీకి మింగుడుపడటం లేదు. అసెంబ్లీ టికెట్లు ఖాళీ లేవు అని తెలిసినా కూడా నాయకులు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నారనే ఉక్రోషం కాంగ్రెస్, బీజేపీలో కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కి ప్రధాన కార్యదర్శిగా కీలక స్థానంలో ఉన్న రంగినేని అభిలాష్ రావు తాజాగా బీఆర్ఎస్ లో చేరడం విశేషం.

రంగినేని అభిషాల్ రావుకి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, పర్యాటక సంస్థ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్‌ యాదవ్, క్రీడా సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి అభిలాష్ రావు అనుచరులు కూడా ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు.


తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అభిలాష్ రావు, కాంగ్రెస్‌లో పనిచేసినా ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు మంత్రి హరీష్ రావు. భవిష్యత్తులో ఆయనకు పార్టీ ఉన్నత స్థానం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క పాలమూరు ఉమ్మడి జిల్లాలోనే 5 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారాయన. కల్వకుర్తికి 100 పడకల ఆస్పత్రి వచ్చిందంటే అది కేసీఆర్ వల్లేనని చెప్పారు. త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకం ప్రారంభం కాబోతోందన్నారు. ఈసారి ఉమ్మడి మహబూబ్‌ నగర్ జిల్లాలో 14 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చేవన్నీ ఉత్తుత్తి డిక్లరేషన్లే అని చెప్పారు.

సహజంగా ఎన్నికల వేళ పార్టీ టికెట్లు ఆశించేవారే అటు ఇటు మారుతుంటారు. కానీ బీఆర్ఎస్ లో టికెట్ల పంచాయితీ దాదాపుగా పూర్తయ్యాక కాంగ్రెస్ నుంచి కీలక నేతలు ఇటువైపు రావడం విశేషం. 

Tags:    
Advertisement

Similar News