తెలంగాణ బరిలో జనసేన.. 32 స్థానాల్లో పోటీ.!

గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో త‌న పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలని ఆ పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించారు.

Advertisement
Update:2023-10-02 19:35 IST

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని 32 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో త‌న పార్టీ అభ్యర్థులను బరిలో దింపాలని ఆ పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్ణ‌యించారు. మూడు నెలల కిందే ఈ 32 నియోజ‌క‌వ‌ర్గాల‌కు జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమించుకుంది.

తెలంగాణ‌లో జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవే..

కూకట్‌పల్లి, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, సనత్‌నగర్, మేడ్చల్‌, ఉప్పల్‌, మల్కాజ్‌గిరి, వైరా, ఖమ్మం, కొత్తగూడెం, అశ్వారావుపేట, పాలేరు, ఇల్లందు, మధిర, సత్తుపల్లి, కోదాడ, మునుగోడు, నకిరేకల్‌, హుజూర్‌నగర్‌, పాలకుర్తి, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగ్‌ల్ ఈస్ట్‌, వరంగల్‌ వెస్ట్, హుస్నాబాద్‌, రామగుండం, జగిత్యాల, మంథని, ఖానాపూర్‌, నాగర్‌కర్నూల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న‌ట్టు ఆ పార్టీ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేసింది.


ఇక ఏపీలో నాలుగో విడత వారాహి యాత్ర ముగిసిన తర్వాత తెలంగాణలోనూ పవన్‌కల్యాణ్‌ వారాహి యాత్ర చేస్తారని తెలుస్తోంది. తెలంగాణ బరిలో జనసేన దిగడంతో కాంగ్రెస్, బీజేపీ.. ఓట్లు చీలి అధికార బీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందని భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News