మంత్రి కోమటి రెడ్డిపై జగదీష్‌రెడ్డి ఫైర్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత జగదీష్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

Advertisement
Update:2024-10-19 21:09 IST
మంత్రి కోమటి రెడ్డిపై  జగదీష్‌రెడ్డి ఫైర్
  • whatsapp icon

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై మంత్రి కోమటి రెడ్డి చేసిన కామెంట్స్‌కు బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. సబ్జెక్ట్‌పై కాకుండా మంత్రి కోమటిరెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు. సమస్యను పక్కదారి పట్టిస్తూ మీడియాకు వినోదం పంచుతున్నాడని జగదీష్‌రెడ్డి అన్నారు.మూసీ కాలుష్యానికి కారణం ఎవరో చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ ద్రోహ ఫలితమే మూసీ కాలుష్యమని ఆయన మండిపడ్డారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురించి మాట్లాడకపోవటమే మంచిది అని అన్నారు.

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఇచ్చి తీరాల్సిందేనన్నారు. మంత్రి తుమ్మల ప్రకటనతో రైతులకు ప్రభుత్వంపై నమ్మకం పోయిందని.. రైతులను మోసం చేశారని స్పష్టంగా తేలిపోయిందన్నారు. అన్నదాతను కేసీఆర్ నుంచి దూరం చేసి ఇప్పుడు వాళ్లని రోడ్డున పడేస్తున్నారన్నారు. ఇన్ని రోజులు కుంటి సాకులు చెప్పి ఇప్పుడు చావు కబురు చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. వాయిదాలు, ఓట్లు అయిపోయి మోసాలే మిగిలాయన్నారు. 

Tags:    
Advertisement

Similar News