హైదరాబాద్‌లో ఐటీ సోదాలు
ప్రముఖ రియల్ ఎస్టేట్‌కు చెందిన కంపెనీల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Advertisement
హైదరాబాద్‌లో ఐటీ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్, చేవెళ్ల, షాద్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు చెందిన కంపెనీల్లో తనికఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో తనిఖీలు కొనసాగుతున్నాయి. కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాల్లో ఏక కాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఓ ఎంఎన్సీ కపెంనీకి రూ.300 కోట్లతో భూమి విక్రయించిన సదరు సంస్థ. షాద్ నగర్లో ఈ భూమిని అమ్మిన స్వస్తిక్ గ్రూప్. అయితే, ఈ భూమి విక్రయానికి సంబంధించి బ్యాలెన్స్ షీట్స్‌లో చూపలేదని అధికారులు ఆరోపిస్తున్నారు. ఇక, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది
Advertisement