అల్లు అర్జున్ ఇంటిపై కాంగ్రెస్ నేతలే దాడి చేయించారని అనుమానం
నిందితుల్లో ఒకరు కాంగ్రెస్ జడ్పీటీసీగా పోటీ చేశారన్న ఎంపీ డీకే అరుణ
Advertisement
సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడిని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఖండించారు. దాడి ఘటనలో నలుగురు కొడంగల్ వాసులున్నారని ఆమె ఆరోపించారు. ఎంపీ లగచర్ల గ్రామంలో పర్యటించారు. లగచర్ల ఘటనలో బెయిల్‌పై విడుదలైన రైతులను పరామర్శించారు. వారితో మాట్లాడారు.ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ... అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఘటన నిందితుల్లో ఒకరు కాంగ్రెస్ జడ్పీటీసీగా పోటీ చేశారు. కాంగ్రెస్ నేతలే దాడి చేయించారనే అనుమానం కలుగుతున్నదన్నారు.
Advertisement