నిజామాబాద్ లో త్వరలో ఐటీహబ్.. కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభం

రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ద్వారా 750 మంది స్థానిక యువతకు, 4 వేల మంది ఇతర ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు కవిత.

Advertisement
Update:2023-03-04 16:47 IST

హైదరాబాద్ కి టి-హబ్, టి-వర్క్స్.. తలమానికంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు నిజామాబాద్ లో కూడా ఐటీహబ్ ఏర్పాటుకి ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. ఐటీ హబ్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. వీటిని త్వరగా పూర్తి చేసి ఐటీ హబ్ ప్రారంభిస్తామని తెలిపారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రూ.50కోట్లతో ఈ ఐటీహబ్ నిర్మిస్తున్నట్టు తెలిపారామె.

నిజామాబాద్‌ లో ఐటీ హబ్‌ భవన సముదాయాన్ని ఎమ్మెల్సీ కవిత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేష్ గుప్తా పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో మౌలిక సదుపాయాల వివరాలను కవిత అడిగి తెలుసుకున్నారు. నిజామాబాద్‌ లో ఐటీ హబ్‌ నిర్మాణానికి సహకరించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కి కవిత ధన్యవాదాలు తెలిపారు. వారి చొరవతోనే ఇక్కడ ఐటీ హబ్ ఏర్పాటవుతుందన్నారు.


యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఐటీ హబ్ నిర్మాణం జరుగుతోందన్నారు ఎమ్మెల్సీ కవిత. రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ద్వారా 750 మంది స్థానిక యువతకు, 4 వేల మంది ఇతర ప్రాంత వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు కవిత. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకెళ్లాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ఐటీ హబ్‌ లను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఆదేశాలిచ్చారని తెలిపారు కవిత. ఈ క్రమంలోనే నిజామాబాద్ లో ఐటీ హబ్ పూర్తయిందని, త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్‌ ప్రారంభిస్తామని ఆమె స్పష్టం చేశారు. మరిన్ని పరిశ్రమలు నిజామాబాద్‌ కు వస్తున్నాయని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News