ఫోన్‌ ట్యాపింగ్‌తో సంబంధం లేదు.. ఇది రాజకీయ కుట్ర : చిరుమర్తి లింగయ్య

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు.

Advertisement
Update:2024-11-14 15:06 IST

ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అదనపు ఎస్పీ (సస్పెండెడ్‌) తిరుపతన్నతో మాట్లాడిన మాట వాస్తవం. మదన్‌రెడ్డి, రాజు నంబర్లు అడిగారు.. నేను బిజీగా.. ఉండటం వల్ల నా పక్కన ఉన్నవాళ్లు మెసేజ్‌ పెట్టారు. అంతేకానీ ట్యాపింగ్‌తో నాకు సంబంధం లేదు. పోలీసులు వాళ్ల దగ్గర ఉన్న ఆధారాలతో నన్ను పిలిచి విచారించారు.. నేను సమాధానం చెప్పాను. విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తాను.’’ అని చిరుమర్తి లింగయ్య అన్నారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానలు చెప్పినని తెలిపారు.

ఈ నెల 9న నోటీసులు ఇచ్చారు. చిన్న విషయాన్నీ పెద్దగా చూస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లాలో పని చేసిన పోలీస్ అధికారులతో తాను మాట్లాడి ఉండవచ్చనని పేర్కొన్నారు. అదేవిధంగా పోలీస్ అధికారుల పోస్టింగ్ ల కోసం, కార్యకర్తల అవసరాల కోసం మాట్లాడటం సహజమేనని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనకు నోటీసులు ఇచ్చినట్టుగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్నందుకే తనకు నోటీసులు వచ్చాయని వెల్లడించారు చిరుమర్తి లింగయ్య. తనకు అందిన నోటీసులపై న్యాయ పోరాటం కూడా చేస్తానని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News