సీఎం రేవంత్‌ రెడ్డిపై ఒక్క ఉద్యమ కేసైనా ఉన్నదా? : హరీష్ రావు

సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి హరీశ్‌రావు పాలాభిషేకం చేశారు.

Advertisement
Update:2024-11-29 14:50 IST

తెలంగాణ కోసం సిద్దిపేటలో దీక్ష చేయని మనిషే లేడని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. ఏ శాఖ కావాలి అంటే నాకు తెలంగాణ శాఖ కావాలని చెప్పిన మహాను భావుడు మాజీ సీఎం కేసీఆర్ అని మాజీ మంత్రి అన్నారు. నేను శాఖ కోసం, మంత్రి పదవి కోసం రాలేదు.. తెలంగాణ కోసం వచ్చాం అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఒక పుస్తకంలో రాశారని హరీష్ రావు పేర్కొన్నారు. ఉద్యమాల కోట దుబ్బాక, గజ్వేల్‌లోనూ దీక్ష చేశారని అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌ రెడ్డితో పాటు భారీగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి హరీశ్‌రావు పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మన భాగస్వామ్యం.. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నంత గొప్పదని చెప్పారు. రేవంత్‌ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై ఒక్క ఉద్యమ కేసైనా ఉన్నదా అని అడిగారు. తమ మీద వందల కేసులు నమోదు చేశారని తెలిపారు.

ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైందని.. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేశారని గుర్తుచేశారు. అప్పుడు రాజీనామా చేయకుండా రేవంత్ రెడ్డి పారిపోయిండని విమర్శించారు. ఇప్పటి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కూడా రాజీనామా చేయలేదని తెలిపారు. రేవంత్‌ రెడ్డి మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైందని హరీశ్‌రావు అన్నారు. అలాంటి రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ ఆనవాళ్లు లేకుండా చేస్తారా అని మండిపడ్డారు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డిపై మరకలు వెంటాడుతూనే ఉంటాయని అన్నారు. తెలుగు దేశం పార్టీతో కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ అని. టీడీపీ రాష్ట్రంలో అడ్డంకిగా ఉండి.. జై తెలంగాణ అంటలేదు.. అప్పుడున్న రాజకీయ అవసరాలతో, తెలుగుదేశంతో కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని టీడీపీతో కేసీఆర్ తీర్మానం చేపించాడు. కాని, ఎన్నికలు అయిపోయాక టీడీపీ మాట మార్చిందని అన్నారు.

Tags:    
Advertisement

Similar News