టీఎస్ఎంఎస్ఐడీసీకి అంతర్జాతీయ గుర్తింపు.. ఐఎస్‌వో సర్టిఫికెట్ జారీ

రాష్ట్రంలో మెడికల్ సేవలు, మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీఎస్ఎంఎస్ఐడీసీకి దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నసంస్థగా స్థానం దక్కించుకోవడం విశేషం.

Advertisement
Update:2023-06-08 06:58 IST

తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ)కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. టీఎస్ఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణాల నాణ్యత, టెండర్లలో పాటిస్తున్న పారదర్శకత ఆధారంగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్‌వో) సంస్థ 9001:2015 సర్టిఫికెట్ జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్త మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తోంది. అంతే కాకుండా అన్ని ఆసుపత్రులకు  మందుల సరఫరా, వైద్య పరికరాలు, ఇతర సామాగ్రిని కొనుగోలు చేస్తోంది. ఇవన్నీ టీఎస్ఎంఎస్ఐడీసీ ద్వారానే జరుగుతాయి.

రాష్ట్రంలో మెడికల్ సేవలు, మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీఎస్ఎంఎస్ఐడీసీ దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నసంస్థగా స్థానం దక్కించుకోవడం విశేషం. ఆరోగ్య తెలంగాణ సాధించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్యారోగ్య రంగానికి విశేష ప్రాధాన్యతను ఇస్తున్నారు. జిల్లాకొక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 21 కొత్త మెడికల్ కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మెడికల్ కాలేజీలు, అనుబంధ అసుపత్రుల నిర్మాణానికి అత్యుత్తమ ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.

మెడికల్ కాలేజీలు సరైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతులు మంజూరు చేయదు. దీంతో టీఎస్ఎంఎస్ఐడీసీ అత్యుత్తమ ప్రమాణాలతో నిర్మాణలు చేపట్టి, అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేస్తున్నది. దీని వల్లే మెడికల్ కాలేజీలకు అనుమతులు సాధ్యమయ్యారు. గతేడాది 8 వైద్య కళాశాలలను ఒకే సారి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఏడాది నుంచి 9 కాలేజీల్లో తరగతులు ప్రారంభం కానున్నాయి. వీటి వెనుక టీఎస్ఎంఎస్ఐడీసీ కృషి ఎంతో ఉన్నది.

టీఎస్ఎంఎస్ఐడీసీకి ఐఎస్‌వో సర్టిఫికెట్ రావడవ పట్ల సంస్థ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణంతో పాటు ఔషదాలు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అత్యంత పారద్శకంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన సలహాలు కూడా ఇచ్చారు. వారి మార్గదర్శకత్వంలో అధికారులు, సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. టీఎస్ఎంఎస్ఐడీసీని దేశంలోనే అత్యుత్తమ కార్పొరేషన్‌గా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News