మేధో దివాళా తీసిన, అవినీతి బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారు.. - కేటీఆర్
కర్ణాటకలో హనుమాన్ చాలీసా పఠించే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేటీఆర్ ట్వీట్ చేశారు. “ఐదేళ్ల డబుల్ ఇంజిన్ సర్కార్లు ప్రజలకు ఏ మేళ్ళు చేయలేక మత ప్రచారంలో మునిగిపోయారు.'' అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
మతపరమైన రాజకీయాలు నడుపుతున్న, అవినీతి కూపంలో కూరుకపోయిన భారతీయ జనతా పార్టీ (BJP)కి వచ్చే ఎన్నికలలో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి నిరసనగా బిజెపి హనుమాన్ చాలీసాను పఠించే ప్రచారాన్ని ప్రారంభించిన నేపథ్యంలో కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.
కర్ణాటకలో హనుమాన్ చాలీసా పఠించే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేపై కేటీఆర్ ట్వీట్ చేశారు. “ఐదేళ్ల డబుల్ ఇంజిన్ సర్కార్లు ప్రజలకు ఏ మేళ్ళు చేయలేక మత ప్రచారంలో మునిగిపోయారు.'' అని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనకు నిరసనగా నగరంలోని నాంపల్లి గాంధీభవన్ లోకి చొచ్చుకెళ్ళేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు.