కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం

గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగా వస్తుందనే నమ్మకం ఉందన్న ఆర్‌ఎస్‌పీ

Advertisement
Update:2024-10-25 13:59 IST

కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నదని, గ్రూప్ 1 అభ్యర్థులు జీవో 29కి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, బొమ్మెర రామ్మూర్తి,రంగినేని అభిలాషలతో కలిసి తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..

గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళిందన్నారు.హైకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధంగా వస్తుందనే నమ్మకం మాకుందన్నారు. జీవో 29పై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు. గ్రూప్4లో 8 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రూప్4లో ఒక్క పోస్టుకు ముగ్గురు అభ్యర్థులు సర్టిఫికేషన్ వేరిఫికేషన్ కు సెలెక్ట్ అయ్యారు. బ్యాక్ లాగ్ పోస్టులు ఉండవని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ మేరకు బ్యాక్ లాగ్ పోస్టులు లేకుండా ప్రభుత్వం జీవో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి అన్నారు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ,జిల్లా అధ్యక్షుడు రోడ్డు ఎక్కారని అన్నారు. ఒకే కేసుపై రాష్ట్రంలో వివిధ పోలీసు స్టేషన్లలో ఎఫ్.ఐ.ఆర్ లు పెడుతున్నారు. పెట్రోల్ పోసి చంపుతానని మైనంపల్లి అంటే ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. పోలీసులే అరికేపూడి గాంధీని తీసుకువచ్చి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసినా స్పందన లేదున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఏక్ పోలీస్ నినాదం ఇచ్చారు. కానిస్టేబుల్స్ కుటుంబ సభ్యులు రోడ్డు ఎక్కుతున్నారు సీఎం రేవంత్ రెడ్డికి పోలీస్ శాఖపై శ్రద్ద లేదని ధ్వజమెత్తారు. నల్గొండలో పోలీసు కుటుంబ సభ్యులను కొట్టుకుంటూ తీసుకువెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు,కర్ణాటకలో అమలు చేస్తున్న ఏక్ పోలీస్ నినాదాన్ని తెలంగాణలో అమలు చేయాలి. అలాగే సస్పెండ్ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్లను ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags:    
Advertisement

Similar News