భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్ హైదరాబాద్‌లో ప్రారంభం
రూ.17.02 కోట్లతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రత్యేకమైన ఈ మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్ 180మీ పొడవు, 10మీ వెడల్పు, దాదాపు 90 మీటర్ల ఎత్తు కలిగి ఉంది.
హైదరాబాద్‌లోని పర్యాటకులకు, వారాంతపు సందర్శకుల కోసం మరో ప్రధాన ఆకర్షణగా, 180 మీటర్ల పొడవు, 90 మీటర్ల ఎత్తుతో దేశంలోనే అతిపెద్ద మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్‌ను ఎన్టీఆర్ మార్గ్ సమీపంలోని హుస్సేన్ సాగర్ వద్ద హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ప్రారంభించింది.
రూ.17.02 కోట్లతో దీన్ని అభివృద్ధి చేశారు. ప్రత్యేకమైన ఈ మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్ 180మీ పొడవు, 10మీ వెడల్పు, దాదాపు 90 మీటర్ల ఎత్తు కలిగి ఉంది.
మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెన్‌లోని కొన్ని ప్రత్యేక లక్షణాలు:
వివిధ థీమ్‌లను ప్రదర్శించడానికి మూడు సెట్ల లేజర్‌లు,
మ్యూజిక్‌తో పాటు క్లౌడ్ ఎఫెక్ట్‌ను సృష్టించేందుకు మిస్ట్ ఫెయిరీ ఫాగ్,
దాదాపు 800 జెట్ హై-పవర్ నాజిల్లు,
డైనమిక్ ఎఫెక్ట్‌ని సృష్టించడానికి నీటి అడుగున 880 LED లైట్లు ఉన్నాయి.
ఫౌంటెన్ యొక్క అన్ని నాజిల్లు, జెట్‌లు DMX కంట్రోలర్ ద్వారా ప్రోగ్రామ్ చేయబడతాయి. సంగీతంతో సింక్రనైజ్ చేయబడతాయి. ఛేజింగ్ నాజిల్‌ల స్ప్రే ఎత్తు 12 మీ నుండి 45 మీ వరకు ఉంటుంది.
ప్రతి రోజూ ఒక్కొక్కటి 20 నిమిషాల పాటు మూడు-షోలు, వారాంతాల్లో రాత్రి 7 నుండి 10 గంటల మధ్య నాలుగు షోలను నిర్వహిస్తుందని HMDA ఒక ప్రకటనలో తెలిపింది.